logo

మోదీ అడుగిడితే ఓటమే: సిద్ధు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఓటమి మూటగట్టుకుంటారని విపక్ష కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘డర్టీ పాలిటిక్స్‌’ చేయడం సంఘపరివార నేతలకు అలవాటేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలతో స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. సమాజంలో చీలికలు

Published : 27 Sep 2022 01:07 IST

చెరువు గట్టున వాయనం సమర్పిస్తున్న సిద్ధరామయ్య

మైసూరు, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడ పర్యటిస్తే.. ఆ ప్రాంతంలో భాజపా నేతలు ఓటమి మూటగట్టుకుంటారని విపక్ష కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. ‘డర్టీ పాలిటిక్స్‌’ చేయడం సంఘపరివార నేతలకు అలవాటేనని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలతో స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. సమాజంలో చీలికలు తీసుకు వచ్చి భాజపా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం చిక్కహొమ్మ గ్రామంలోని చెరువు గట్టున సోమవారం సిద్ధు వాయనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీసీసీ కార్యాధ్యక్షుడు సతీశ్‌ జార్ఖిహొళి, యతీంద్రలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ పాదయాత్రతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో గెలవలేదని ఎద్దేవా చేస్తున్న భాజపా నాయకులు గతంలో మోదీ పర్యటించిన పంజాబ్‌, తెలంగాణ, కేరళలో ఏమైందో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని భాజపా చేస్తున్న విమర్శలు ఏదో ఓరోజు వారికే తిరుగుబాణాలు అవుతాయని హెచ్చరించారు. రాహుల్‌ కర్ణాటకలో పర్యటిస్తే మళ్లీ గెలుపు మాదేనని ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాజకీయాల్లో తాను కర్ణుడు లాంటివాడినని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విమర్శలు చేసి, తప్పించుకోవాలని కోరుకునేవారే అలా విమర్శలు చేస్తుంటారని తూర్పారబట్టారు. వినాయక చవితి వేడుకల్లో ‘మహాత్ముడిని హత్య చేసిన గాడ్సే’ చిత్రాలు ఉంచి ఊరేగించడమే డర్టీ పాలిటిక్స్‌ అని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు