logo

నీటి సరఫరాలో విఫలం

మాన్వి, సిరివార తాలూకాల రైతులకు తుంగభద్ర ఎడమ కాలువ నీటిని సరిగ్గా సరఫరా చేయటంలో నీటి పారుదల శాఖ అధికారులు విఫలమయ్యారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. వర్షాలు పడుతున్నా కాలువలకు నీరు సరఫరా కాకపోవడం అధికారుల తప్పిదమేమని రైతు సంఘం నాయకుడు చామరస్‌మాలీ పాటిల్‌

Published : 27 Sep 2022 01:07 IST

అధికారులకు సూచనలు చేస్తున్న రైతు సంఘం నాయకుడు చామరస్‌మాలీపాటిల్‌

మాన్వి,న్యూస్‌టుడే: మాన్వి, సిరివార తాలూకాల రైతులకు తుంగభద్ర ఎడమ కాలువ నీటిని సరిగ్గా సరఫరా చేయటంలో నీటి పారుదల శాఖ అధికారులు విఫలమయ్యారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. వర్షాలు పడుతున్నా కాలువలకు నీరు సరఫరా కాకపోవడం అధికారుల తప్పిదమేమని రైతు సంఘం నాయకుడు చామరస్‌మాలీ పాటిల్‌ అధికారులను నిలదీశారు. సోమవారం నీటి పారుదల శాఖ అధికారుల, రైతుల సమావేశాన్ని పట్టణంలో నిర్వహించారు. గురువారం నాటికి కాలువలో పూర్తి స్థాయిలో నీటి గేజీని కాపాడతామని, పైభాగంలోని అక్రమ పైపులని మూయించి దిగువకి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. దీంతో రైతులు తలపెట్టిన రాస్తారోకోని విరమించారు. గురువారం నీరు అందకుంటే శుక్రవారం ఆందోళనకు దిగుతామని రైతులు స్పష్టం చేశారు. తహసీల్దార్లు చంద్రకాంత్‌, అబ్దుల్‌ వాహిద్‌ గ్రేడ్‌2, నీటి పారుదల శాఖ అధికారులు శరణప్ప నాయక్‌, సూర్యకాంత్‌ మానే, రైతు నాయకులు శంకరగౌడ హరవి, రామలిగారెడ్డి, శ్రీరాములు, అమరేశ్‌, నాగరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts