logo

డీకే వినతిపై ఆక్షేపణలకు అవకాశం

ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ వేసుకున్న అర్జీపై అదనపు ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు సీబీఐ అధికారులు హైకోర్టును కాలావకాశాన్ని

Published : 27 Sep 2022 01:07 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్న ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ వేసుకున్న అర్జీపై అదనపు ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు సీబీఐ అధికారులు హైకోర్టును కాలావకాశాన్ని కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని జస్టిస్‌ ఎస్‌.సునీల్‌ దత్త యాదవ్‌ దృష్టికి సీబీఐ తరఫు న్యాయవాది తీసుకు వెళ్లారు. గతంలో ఒకసారి ఆక్షేపణల అర్జీని దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. శివకుమార్‌కు 2013లో రూ.33.92 కోట్ల ఆస్తి ఉండగా, 2018 ఏప్రిల్‌ 30 నాటికి అది రూ.128.60 కోట్లకు చేరుకుంది. ఆదాయానికి సంబంధించి ఆయన ఇప్పటికీ పూర్తి వివరాలు అందించలేదు. దసరా సెలవుల అనంతరం విచారణను తిరిగి ప్రారంభిస్తామని జస్టిస్‌ సునీల్‌ దత్త యాదవ్‌ ప్రకటించారు. ఆ సమయానికి ఆక్షేపణల అర్జీని దాఖలు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని