logo

అర్ధరాత్రి కాలువ పరిశీలన

తుంగభద్ర కాడా అధ్యక్షుడు కొల్లా శేషగిరిరావు ఆదివారం అర్ధరాత్రి కాలువ నీటి సరఫరాను పరిశీలించారు. కాలువ పొడవునా జరుగుతున్న నీటిచౌర్యంపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. అధికారులకు సమాచారం 43వ మైలు కాలువ వద్దకు రావాలని

Published : 27 Sep 2022 01:07 IST

మాన్వి, న్యూస్‌టుడే: తుంగభద్ర కాడా అధ్యక్షుడు కొల్లా శేషగిరిరావు ఆదివారం అర్ధరాత్రి కాలువ నీటి సరఫరాను పరిశీలించారు. కాలువ పొడవునా జరుగుతున్న నీటిచౌర్యంపై నిఘా పెట్టామని ఆయన తెలిపారు. అధికారులకు సమాచారం 43వ మైలు కాలువ వద్దకు రావాలని సూచించారు. మూసి ఉంచాల్సిన కాలువల గేట్లు తెరిచి అక్రమంగా నీటిని మళ్లిస్తున్న వైనాన్ని ఆయన నీటి పారుదలశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా వేసిన పైపులను తొలగించాలని, లేనిపక్షంలో రైతులే వాటిని తొలగిస్తారని హెచ్చరించారు. ఆయన తనిఖీతో సోమవారం 69వ మైలు వద్ద తుంగభద్ర కాలువ నీటి గేజీ 9 అడుగులకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని