logo

పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారు

భాజపాలోని పలువురు శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారని కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎం.బి.పాటీల్‌ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Sep 2022 02:20 IST

భాజపాపై కాంగ్రెస్‌ ఎదురుదాడి

మాట్లాడుతున్న గ్రామీణ శాసనసభ్యుడు బి.నాగేంద్ర, చిత్రంలో ఎం.బి.పాటీల్‌,
వి.ఎస్‌.ఉగ్రప్ప, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: భాజపాలోని పలువురు శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి మునిగాళ్లపై నిలబడ్డారని కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు ఎం.బి.పాటీల్‌ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా శాసనసభ్యులు, నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ తదితర నేతలతో మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందే రాష్ట్రంలో మార్పులు వస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో హొసపేటె మాజీ శాసనసభ్యుడు హెచ్‌.ఆర్‌.గవియప్ప భాజపా నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. భాజపా మాదిరిగా ఆపరేషన్‌ కమలం చేయడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీలోకి వస్తున్నట్లు ఎం.బి.పాటీల్‌ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళీన్‌ కుమార్‌ కటీల్‌ మెదడు, నోటికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. భాజపాలోనే ఆయన మాట వినే పరిస్థితుల్లో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐ సంఘటనను ఐదేళ్ల పాటు రద్దు చేసింది. ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు సృష్టిస్తున్న మతఛాందసవాదుల సంఘాలను కూడా నిషేధించాలన్నారు. ఇటీవల భాజపా 2023లో జరిగే విధానసభ ఎన్నికలపై సర్వే చేయగా, భాజపా 60, కాంగ్రెస్‌ 140 స్థానాల్లో గెలుపొందుతున్నట్లు తేలిందన్నారు. 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కచ్చితమన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. లోక్‌సభ మాజీ సభ్యుడు వి.ఎస్‌.ఉగ్రప్ప, శాసనసభ్యుడు బి.నాగేంద్ర, మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, నారా భరత్‌రెడ్డి, అల్లం ప్రశాంత, మహమ్మద్‌ రఫీక్‌, శివయోగి, జె.ఎస్‌.ఆంజినేయులు, బెణకల్లు బసవరాజగౌడ, పేరం వివేక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని