logo

వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు

బళ్లారి జిల్లా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా సాగాయి. దేవస్థానాల్లో అమ్మవార్లు పలు అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బెంగళూరు రహదారిలోని కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

Published : 29 Sep 2022 02:20 IST

పటేల్‌ నగర్‌లోని సణ్ణ దుర్గమ్మకు విశేష అలంకరణ

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి జిల్లా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా సాగాయి. దేవస్థానాల్లో అమ్మవార్లు పలు అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బెంగళూరు రహదారిలోని కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బళ్లారి కనక దుర్గమ్మ, సణ్ణ మార్కెట్‌లోని శాంభవి మాత, పటేల్‌ నగర్‌లోని అమ్మవారు, ఏళు మక్కల దేవస్థానం అమ్మవారు, బళ్లారి తాలూకా కృష్ణానగర్‌ క్యాంపులో దుర్గమ్మ దేవి వివిధ అలంకారాల్లో కొలువుదీరారు. విద్యానగర్‌లోని అభయాంజనేయ దేవస్థానంలో మేయర్‌ మోదపల్లి రాజేశ్వరి, బళ్లారి వాణిజ్య, పారిశ్రామిక సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసరావు, అర్చకుడు తదితరులను సత్కరించారు.
బళ్లారి గ్రామీణ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం శృంగేరి మఠంలో శారదామాతకు, విద్యానగర్‌ దుర్గాదేవికి, చిన్నదుర్గమ్మకు గాయత్రిదేవి రూపంలో అలంకరించి పూజించారు. తుల్జాభవాని, రేణుకయల్లమ్మ, కుడితిని సీతరాములును పుష్పాలతోనూ అలంకరించారు. బెంకిమారెమ్మకు ముత్తరత్నాలతో అలంకరించారు. కనకదుర్గమ్మదేవి, కన్యకాపరమేశ్వరీకి, నగరేశ్వరీదేవికి విశేష పూజలు చేశారు. భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు ప్రసాదం పంచిపెట్టారు.
సింధనూరు: సింధనూరు పట్టణ ఆదర్శకాలనీలోని అంబాదేవి ఆలయ గర్భగుడిలోని అంబమ్మతల్లి విగ్రహం బుధవారం ఎండు పళ్లతో కళకళలాడింది. ఎస్‌ఎస్‌కే సమాజం ప్రజలు అంబాదేవికి ప్రీతిపాత్రమైన ఎండుద్రాక్ష, బాదం. జీడిపప్పు, అంజూర, చెర్రీ పళ్లతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. అన్నీ నాలుగు కిలోల చొప్పున తెచ్చి తెల్లవారుజామునే అలంకారం చేశారు. గాంధీనగర్‌లోని శ్రీవిశ్వేశ్వర పంచాయతన క్షేత్రం ఈశ్వరాలయంలో దసరా కోసం నిర్మించిన ప్రత్యేక మంటపంలో మహిళలు పెద్దఎత్తున లలితా సహస్రనామంతో గాయత్రీదేవిని కీర్తించారు. ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ క్షీరాన్నం, పెసరపునుగులు ప్రసాదంగా అందించారు.
కారటగి: కారటగి దేవి క్యాంపు రత్నగిరిపై వెలిసిన శ్రీదేవి అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పంచామృతాభిషేకం, చంద్ర ఘంట పూజ, హోమాలు తదితర ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాలు, క్యాంపుల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
* శ్రీరామనగర్‌లో: శ్రీరామనగర్‌లోని కనకదుర్గాదేవి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని పూలు, పండ్లతో అలంకరించారు. ప్రసాద వితరణ జరిగింది. అంజూరి క్యాంపు, కోటయ్య క్యాంపు, ముష్టూరు క్యాంపు, హొసకేర, గుండూరు, హణవాళ తదితర క్యాంపుల్లోని దేవి ఆలయాల్లో పూజలు జరిగాయి.
కంప్లిలో: కంప్లి పట్టణలంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో దర్శనమిచ్చారు. లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన, పల్లకీ ఉత్సవం, సామూహిక పూజలు జరిగాయి. బన్ని మహంకాళి ఆలయంలో సైతం పూజలు నిర్వహించారు.
హొసపేటె: శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో పూజలు, అలంకరణలు మిన్నంటాయి. వాల్మీకులు నివసించే కేరి(వాడ)లో నిజలింగమ్మ, కొంగమ్మ అమ్మవార్లను ప్రత్యేకంగా బంతిపూలతో అలంకరించి పూజించారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని నం.88 ముద్లాపురలో ఏళుమక్కళ తాయమ్మ ఆలయంలో ఉదయం నుంచి పలు పూజాకైంకర్యాలు నెరవేరాయి. పట్టణంలోని వడకరాయ ఆలయంలో ఏడుకొండల స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
కళలతో విద్యార్థుల్లో జ్ఞానాభివృద్ధి
సిరుగుప్ప: కళలతో విద్యార్థుల్లో ప్రతిభ మెరుగుపడి జ్ఞానం వృద్ధి చెందుతుందని విద్యాశాఖ సంయోజకుడు పాండు పేర్కొన్నారు. తెక్కెలకోట ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్ధులకు కలికా చేతరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు చిత్రకళలు, ముగ్గులు, వేషధారణ, తదితర పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మాన్వి: దసరా వేడుకల్లో భాగంగా స్థానిక నగరేశ్వర ఆలయంలో బుధవారం సామూహిక కుబేర లక్ష్మీ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్వారకానాథ్‌ భÆట్టు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం సాగింది. దేవస్థానం ప్రాంగణంలో లక్ష్మీదేవి, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించి కుబేర పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవీ మహిళా మండలి సభ్యులు పూజల్లో పాల్గొన్నారు.
సిరుగుప్ప: శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. బుధవారం ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

విద్యానగర్‌ దుర్గాదేవికి విశేష అలంకరణ


కారటగి: గాయత్రి దేవిగా శ్రీదేవి అమ్మవారు


కంప్లి: బ్రహ్మచారిణిగా వాసవీ మాత

వివిధ వేషధారణలతో చిన్నారుల ప్రదర్శన
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని