logo

భారతీయ సంస్కృతి.. విశ్వానికే తలమానికం

భారతీయ సంస్కృతి విశ్వానికే తలమానికంగా నిలిచిందని వాణిజ్య పారిశ్రామిక మండలి జిల్లా అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి విద్యానగర్‌ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన దసరా సంబరాలు-2022 అనే కార్యక్రమాన్ని ఆయన హార్మోని వాయించి ప్రారంభించారు.

Published : 29 Sep 2022 02:20 IST

నేగిలయోగి నాటిక కళాకారులను అభినందించిన మేయర్‌ రాజేశ్వరీ, వాణిజ్యమండలి అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు, విష్ణు, తదితరులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతి విశ్వానికే తలమానికంగా నిలిచిందని వాణిజ్య పారిశ్రామిక మండలి జిల్లా అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి విద్యానగర్‌ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన దసరా సంబరాలు-2022 అనే కార్యక్రమాన్ని ఆయన హార్మోని వాయించి ప్రారంభించారు. కళలు, సంస్కృతి, సంస్కారాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వాణిజ్య మండలి ఆధ్వర్యంలో రైతులకు ఉచిత అన్నదానం, ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతివారు తోటివారికి సహాయం చేయాలన్నారు. దేవాలయం అధ్యక్షుడు దివంగత వెంకటస్వామి అందించిన సేవలు మరవలేమన్నారు. తుంగ గంగా సాంస్కృతిక కళాట్రస్ట్‌ సేవలను కొనియాడారు. మేయర్‌ రాజేశ్వరీ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక నాటికలు ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన శ్రీనివాసరావుకు వాణిజ్యరత్న, రవికి సమాజసేవారత్న, ముజావర్‌, వీరనగౌడలకు రంగ కళారత్న, గోవిందరెడ్డికి వ్యాపారరత్న పురస్కారాలను అందజేసి సత్కరించారు. అనంతరం రామచంద్ర దర్శకత్వంలోని నేగిలయోగి నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులను ఆలయ కమిటీ, తుంగ గంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బోయపాటి విష్ణువర్ధన్‌, ఆలయ అధ్యక్షుడు భాస్కర్‌నాయుడు, ముత్యాలరాజు, శ్రీనివాసరెడ్డి, డా.గాదిలింగనగౌడ, రవిచంద్ర, కొండయ్య, మోహన్‌దాసు, సాయిబాబా పాల్గొన్నారు.  

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts