logo

పరిహారం ఇవ్వాలని ఆశాల ఆందోళన

విధుల్లో భాగంగా కూడ్లిగి వెళ్తూ బైకుపై నుంచి కిందపడి మృతిచెందిన కూడ్లిగి తాలూకా ఆశా కార్యకర్త శైలజా కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం పరిహారం అందివ్వాలని కర్ణాటక రాష్ట్ర సంయుక్త ఆశా కార్యకర్తల సంఘం ప్రముఖులు డాక్టర్‌ ప్రమోద్‌, ఎ.శాంతా, ఎస్‌.వీరమ్మ డిమాండ్‌ చేశారు.

Published : 29 Sep 2022 02:20 IST

జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు

హొసపేటె, న్యూస్‌టుడే: విధుల్లో భాగంగా కూడ్లిగి వెళ్తూ బైకుపై నుంచి కిందపడి మృతిచెందిన కూడ్లిగి తాలూకా ఆశా కార్యకర్త శైలజా కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం పరిహారం అందివ్వాలని కర్ణాటక రాష్ట్ర సంయుక్త ఆశా కార్యకర్తల సంఘం ప్రముఖులు డాక్టర్‌ ప్రమోద్‌, ఎ.శాంతా, ఎస్‌.వీరమ్మ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద వీరు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడ్లిగిలో మినీ విధానసౌధ ప్రారంభోత్సవానికి వెళ్లాలని తాలూకా వైద్యశాఖ అధికారి మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో కార్యకర్త శైలజా బైకుపైన వెళ్తూ అదుపుతప్పి కిందపడి మరణించారు. ఆశా కార్యకర్తలకు సంబంధంలేని విధులను అప్పగించడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, వైద్యశాఖలు ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. డీహెచ్‌వో డాక్టర్‌ సలీంకు వినతిపత్రం సమర్పించారు. తాలూకా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ బసవరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు