logo

రెండు సున్నాలు.. మూడు నామాలు!

పోలీస్‌ ఎస్సై ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అక్రమాల కేసులో ఐపీఎస్‌ అధికారి అమృత్‌పాల్‌కు సంబంధించి ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో సీఐడీ పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంలో ‘డబుల్‌ జీరో కోడ్‌’ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

Published : 30 Sep 2022 02:49 IST

అమృత్‌పాల్‌పై అభియోగం

అమృత్‌పాల్‌ (పాతచిత్రం)

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పోలీస్‌ ఎస్సై ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అక్రమాల కేసులో ఐపీఎస్‌ అధికారి అమృత్‌పాల్‌కు సంబంధించి ఒకటో ఏసీఎంఎం న్యాయస్థానంలో సీఐడీ పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రంలో ‘డబుల్‌ జీరో కోడ్‌’ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. అమృతపాల్‌కు బినామీగా వ్యవహరించిన శంభులింగస్వామితో కొనసాగించిన నగదు లావాదేవీల సందర్భంలో ఈ కోడ్‌ వాడినట్లు సీఐడీ గుర్తించింది. అభ్యర్థులు, దళారుల నుంచి శంభులింగ స్వామి నగదు వసూలు చేసి అమృతపాల్‌కు అందించేవాడు. తాను రూ.10 లక్షల నగదు ఇస్తే.. అందులో రెండు సున్నాలు తొలగించి రూ.10వేలు ఇచ్చినట్లు కంప్యూటర్‌ ఎక్సెల్‌ షీటులో నమోదు చేసుకుని, దాన్ని పెన్‌డ్రైవ్‌లోకి బదిలీ చేసుకున్నారు. పలువురు అభ్యర్థులు, దళారుల నుంచి శంభులింగస్వామి రూ.2 కోట్లు వసూలు చేసి అందులో రూ.1.41 కోట్లు ఐపీఎస్‌ అధికారికి ఇచ్చాడని అభియోగపత్రంలో అధికారులు వివరించారు. ఇద్దరినీ వేర్వేరుగా విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని అంగీకరించారు. చిక్కబళ్లాపుర జిల్లా నందికి సమీపంలోని హొసహుడ్యా గ్రామంలో నాలుగు ఎకరాల్లో ఫార్మ్‌హౌస్‌ను అమృతపాల్‌ తన తండ్రి నేతారామ్‌ బన్సాల్‌ పేరిట అభివృద్ధి చేశారు. శిడ్లఘట్ట సమీపంలోని నెలప్పనహళ్లి వద్ద మూడు చోట్ల 17.15 ఎకరాల పొలాన్ని నేతారామ్‌ బన్సాల్‌ పేరిట కొనుగోలు చేశారని సీఐడీ అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని