logo

కన్నడ పుస్తక ప్రదర్శన ఏదీ?

అధికార పార్టీ కన్నడ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో కన్నడ పుస్తకాల ప్రదర్శన, విక్రయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసిందని తప్పుపట్టారు.

Published : 30 Sep 2022 02:49 IST

మైసూరు, న్యూస్‌టుడే : అధికార పార్టీ కన్నడ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. మైసూరు దసరా ఉత్సవాల్లో కన్నడ పుస్తకాల ప్రదర్శన, విక్రయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది రద్దు చేసిందని తప్పుపట్టారు. కన్నడ సాహిత్యం, సంప్రదాయాలను పక్కన పెట్టి ఉత్తర భారతదేశం తరహా విధానాలను ఇక్కడి ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు. మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కన్నడ భాష, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు కన్నడిగులు వేచి చూస్తున్నారని వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. దసరా కవిగోష్ఠిలో ఈ ఏడాది బ్యారీ భాషకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. కేవలం ఒక సముదాయానికి చెందిన వారు మాత్రమే బ్యారీ మాట్లాడతారని ఈ ఏడాది కవిగోష్ఠిలో అవకాశం కల్పించలేదని అధికారులు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని