logo

ఎమ్మెల్యే రిజ్వాన్‌కు ఊరట

లోక్‌సభ ఎన్నికల సందర్భంలో నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీనగర ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌పై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బెంగళూరు కేంద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

Updated : 01 Oct 2022 02:35 IST

రిజ్వాన్‌ అర్షద్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల సందర్భంలో నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీనగర ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌పై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బెంగళూరు కేంద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దొడ్డనెకుంది పరిధి కోదండరామ కూడలిలో ఆలయంలో 2019 ఏప్రిల్‌ 13న నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాల్లో అనుమతి పొందకుండా ప్రచారాన్ని నిర్వహించారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారులు ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. కులం, మతాల ఆధారంగా ఎక్కడా ఓటు వేయాలని కోరలేదని రిజ్వాన్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయనపై చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ అధికారులు రుజువు చేయలేకపోయారు. ఆ కేసును రద్దు చేస్తూ జస్టిస్‌ సునీల్‌ దత్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి ఎన్నికల్లో రిజ్వాన్‌ ఓటమి పాలైనా.. తరువాత ఉప ఎన్నికల్లో ఆయన శివాజీనగర నుంచి ఎన్నికయ్యారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts