logo

దేహదారుఢ్యానికి క్రీడలు దోహదం

యువకులు క్రీడా సాధన చేయడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, యువ సబలీకరణ, క్రీడాశాఖ బళ్లారి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా స్థానిక డా.రాజ్‌కుమార్‌ రహదారిలోని బి.డి.ఎ.ఎ.

Published : 03 Oct 2022 04:15 IST

ఫుట్‌బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఏసీ డా.ఆకాశ్‌ శంకర్‌, చిత్రంలో మంత్రి, శాసనసభ్యుడు, మేయర్‌, డీసీ, ఎస్పీ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే : యువకులు క్రీడా సాధన చేయడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా ఉంటారని జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, యువ సబలీకరణ, క్రీడాశాఖ బళ్లారి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా స్థానిక డా.రాజ్‌కుమార్‌ రహదారిలోని బి.డి.ఎ.ఎ. ఫుట్‌బాల్‌ క్రీడామైదానంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్‌ పోటీలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. క్రీడా పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ సందర్భంలో ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు రోనాల్డ్‌, సునీల్‌ ఆదర్శాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అనేక ఏళ్ల తర్వాత బళ్లారి నగరంలో ఫుట్‌బాల్‌ క్రీడాపోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బళ్లారి ఉప విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ డా.ఆకాశ్‌ శంకర్‌ మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఫుట్‌బాల్‌ పోటీలను నిర్వహించాలని పలువురు ఆటగాళ్లు తమ దృష్టికి తీసుకొని రావడంతో ఫుట్‌బాల్‌ లీజ్‌ మ్యాచ్‌లు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయన ఫుట్‌బాల్‌ ఆడి పోటీలను ప్రారంభించారు. మేయర్‌ మోదపల్లి రాజశ్వేరి, లోక్‌సభ మాజీ సభ్యురాలు శాంత, జిల్లా పాలనాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి, జిల్లా పోలీస్‌ అధికారి సైదులు ఆడావత్‌, క్రీడాశాఖాధికారి హరిసింగ్‌ రాథోడ్‌, కోచ్‌లు శాంతి, జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని