logo

మళ్లీ చిరుత చిత్రాలు చక్కర్లు

బళ్లారి కొండపై 40 రోజుల తర్వాత చిరుత ప్రత్యక్షమైంది. చిరుత కొండపై సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తక్షణమే అటవీశాఖ ఉప సంరక్షణ సూర్యవంశీ సందీప్‌ ఆదేశాలతో ఆర్‌.ఎఫ్‌.ఒ. రాఘవేంద్ర తమ సిబ్బందితో సంజయ్‌గాంధీ నగర్‌కు చేరుకుని చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలను పరిశీలించారు.

Published : 03 Oct 2022 04:15 IST

అప్రమత్తమైన అటవీ శాఖాధికారులు


కొండపై ఉన్న చిరుతను పరిశీలిస్తున్న అటవీశాఖాధికారులు, సిబ్బంది

బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి కొండపై 40 రోజుల తర్వాత చిరుత ప్రత్యక్షమైంది. చిరుత కొండపై సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తక్షణమే అటవీశాఖ ఉప సంరక్షణ సూర్యవంశీ సందీప్‌ ఆదేశాలతో ఆర్‌.ఎఫ్‌.ఒ. రాఘవేంద్ర తమ సిబ్బందితో సంజయ్‌గాంధీ నగర్‌కు చేరుకుని చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఉన్న కొండపై 40 రోజుల ముందు చిరుత ప్రత్యక్షమైనట్లు చిరుత సంచరించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో అటవీశాఖాధికారులు పోలీసుల సహకారంతో కొండ చుట్టుపక్కల ప్రత్యేక పోలీసుల భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు బోన్లను కూడా అమర్చారు. వారం రోజులపాటు అటవీ శాఖాధికారులు కొండపై డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. రాత్రి పూట సంచరించే దృశ్యాలను నిక్షిప్తం చేయడానికి కొండపై మూడు ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి చిన్న ఆచూకీ కూడా కనిపించలేదు. కొండ చుట్టుపక్కల వాసులు చిరుత భయం నుంచి బయట పడ్డారు. ఆదివారం ఉదయం కొండ బండరాళ్లపై చిరుత సంచరిస్తున్న దృశ్యాలను స్థానిక ప్రజలు గుర్తించి చరవాణిలో ఫొటోలు తీశారు. సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని అటవీ శాఖాధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు అధికారులు అప్రమత్తమవయ్యారు. అధికారి రాఘవేంద్ర తమ సిబ్బందితో కొండ వద్దకు చేరుకొని డ్రోన్‌ కెమెరాలతో పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ప్రత్యేక బృందాలతో భద్రత ఏర్పాటు చేశారు. కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలలో రాత్రి వేళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సోమవారం కొండపైకి వెళ్లి చిరుత కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. గత 40 రోజుల నుంచి కొండ చుట్టపక్కల కాలనీల్లో ఉంటున్న వీధి కుక్కలు మాయమవుతున్న విషయం స్థానికులు అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొండ చుట్టపక్కల ఉన్న సంజయ్‌గాంధీనగర్‌, సిద్ధార్థ నగర, నాగల చెరువు, కోట ప్రదేశం దేవినగర్‌, తదితర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

బళ్లారి కొండలోని బండరాయిపై కనిపిస్తున్న చిరుత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని