logo

కృషితో ఏదైనా సాధించవచ్చు

అలుపెరగని కృషి, అకుంఠిత దీక్షతో ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని విజయనగర జిల్లా పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని విజ్ఞాన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్‌-100 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

Published : 03 Oct 2022 04:15 IST

విద్యార్థినులతో కలిసి సూపర్‌ 100 కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌

హొసపేటె, న్యూస్‌టుడే : అలుపెరగని కృషి, అకుంఠిత దీక్షతో ముందుకు వెళితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని విజయనగర జిల్లా పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని విజ్ఞాన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్‌-100 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 100 మంది పీయూసీ ద్వితీయ సంవత్సర సైన్స్‌ విద్యార్థులను ఎంపికచేసి వారికి నీట్‌, సీఈటీ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే ఈ సూపర్‌-100 కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. దీనికోసం జిల్లా ఖనిజ నిధులను ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఉన్నత చదువులపై ఆశ పెట్టుకున్న నిరుపేద విద్యార్థులకు నిరాశ కలగకూడదన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. పట్టణంలోని విజ్ఞాన్‌ పీయూ కళాశాలలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన వంద మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, రవాణా ఖర్చులను కూడా జిల్లా యంత్రాంగమే భరిస్తుందన్నారు. నోడల్‌ అధికారి ఈరప్ప బిరాదార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో పీయూ విద్యాశాఖ డీడీ నాగరాజ్‌ హవాల్దార్‌, విజ్ఞాన్‌ కళాశాల, ఇతర కళాశాలల ప్రధానాచార్యులు విద్యాధర్‌, జె.సిద్రామ, ఎన్‌.ఎన్‌.ధర్మాయత్‌, హాలప్ప, షణ్ముఖప్ప బాగేవాడి, రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని