logo

సింధనూరును జిల్లాగా ప్రకటించాలని యాత్ర

నవ సంకల్పం- నవ సింధనూరు పేరిట ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బసనగౌడ బాదర్లి సోమవారం చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంతో పట్టణం దద్దరిల్లింది. సింధనూరును కొత్త జిల్లాగా ప్రకటించాలని, రైతులు, యువత మేలు కోరుతూ మొత్తం ఆరు కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బసనగౌడ బాదర్లి ఈ బృహత్‌ పాదయాత్ర ప్రారంభించారు.

Published : 04 Oct 2022 02:18 IST

నవ సంకల్పం అంటూ..నాగలి పట్టుకుని పాదయాత్రలో సాగిపోతున్న బసనగౌడ బాదర్లి

సింధనూరు, న్యూస్‌టుడే: నవ సంకల్పం- నవ సింధనూరు పేరిట ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బసనగౌడ బాదర్లి సోమవారం చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంతో పట్టణం దద్దరిల్లింది. సింధనూరును కొత్త జిల్లాగా ప్రకటించాలని, రైతులు, యువత మేలు కోరుతూ మొత్తం ఆరు కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బసనగౌడ బాదర్లి ఈ బృహత్‌ పాదయాత్ర ప్రారంభించారు. కొత్త జిల్లాగా ఆవిర్భంచడానికి సింధనూరుకు సకల అర్హతలూ ఉన్నా..స్థానిక నాయకులెవరూ దాని ఊసెత్తకపోవడం శోచనీయమని విమర్శించారు. తమ వ్యక్తిగత అభివృద్ధి తప్ప సింధనూరు మేలుకోసం ప్రయత్నం చేయని నాయకులను పక్కనపెట్టి జనం సహకారం కోరుతూ వారిని చైతన్యపర్చడానికి వారి ఇళ్ల వద్దకే వెళ్దామని ఈ పాదయాత్ర ప్రారంభించినట్లు ప్రకటించారు. మేళతాళాలతో, భాజాభజంత్రీలతో యాత్ర హోరెత్తింది. తొలి ప్రయత్నంగా సోమవారం స్థానిక అంబాదేవి ఆలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అంబామఠంలోని అంబాదేవి దేవస్థానం వరకూ పాదయాత్ర జరిపారు. యువత అధికసంఖ్యలో పాల్గొని బాసనగౌడకు బాసటగా నిలిచి అడుగడుగునా గజమాలలతో స్వాగతం పలికారు. అన్నదాత ఆయుధం నాగలిని చేతపట్టి బసనగౌడ యాత్రలో సాగిపోయారు. యాత్ర కారణంగా పట్టణంలో దాదాపు రెండు గంటలసేపు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.


పాదయాత్రకు వన్నె తెస్తూ..కలశాలతో పాల్గొన్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని