logo

కలబురగిలో రాష్ట్రస్థాయి ఓబీసీ బృహత్‌ సమావేశం

భాజపా ఓబీసీ రాష్ట్రస్థాయి బృహత్‌ సమావేశాన్ని అక్టోబర్‌ 30న కలబురగిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి భైరతిబసవరాజ్‌ వెల్లడించారు. నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో ఈ సమావేశంపై చర్చించామన్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

వివరాలను వెల్లడిస్తున్న మంత్రి బైరతి బసవరాజు

తుమకూరు, న్యూస్‌టుడే: భాజపా ఓబీసీ రాష్ట్రస్థాయి బృహత్‌ సమావేశాన్ని అక్టోబర్‌ 30న కలబురగిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి భైరతిబసవరాజ్‌ వెల్లడించారు. నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రదుర్గ, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో ఈ సమావేశంపై చర్చించామన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రముఖ నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు ఒరిగేది ఏమిలేదన్నారు. డి.కె.శివకుమార్‌, సిద్ధరామయ్యలను కలపడమే యాత్ర ముఖ్య లక్షణమని ఎద్దేవా చేశారు. భాజపాపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాంట్రాక్టర్‌ కెంపణ్ణ ఆరోపణలు అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రి ఈనెల 7న అఖిలపక్ష సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సభలో వివిధ సముదాయాల రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటారని వివరించారు. సమావేశంలో వెనుకబడిన వర్గాల ప్రతినిధి ఎం.డి.లక్ష్మీనారాయణ, జిల్లా భాజపా అధ్యక్షుడు రవిశంర్‌హెబ్బాక, బెట్టస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని