logo

నూతన ఎస్పీగా రంజిత్‌కుమార్‌ బండారు

బళ్లారి జిల్లా పోలీస్‌ అధికారి సైదులు అడావత్‌ బెంగళూరుకు బదిలీ అయ్యారు. నూతన పోలీస్‌ అధికారిగా రంజిత్‌కుమార్‌ బండారును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి బళ్లారి జిల్లా పోలీస్‌ అధికారిగా సైదులు అడావత్‌ 2020 సెప్టెంబరు 2వ తేదీ బాధ్యతలు తీసుకున్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

బదిలీ అయిన ఎస్పీ సైదులు అడావత్‌

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి జిల్లా పోలీస్‌ అధికారి సైదులు అడావత్‌ బెంగళూరుకు బదిలీ అయ్యారు. నూతన పోలీస్‌ అధికారిగా రంజిత్‌కుమార్‌ బండారును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి బళ్లారి జిల్లా పోలీస్‌ అధికారిగా సైదులు అడావత్‌ 2020 సెప్టెంబరు 2వ తేదీ బాధ్యతలు తీసుకున్నారు. రెండు సంవత్సరాలు 32రోజులు పాటు విధులు నిర్వహించారు. శాంతిభద్రతలు, మట్కా, క్లబ్‌లు, అక్రమంగా బియ్యం తరలించడం అడ్డుకోవడం విఫలం చెందినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఐదు రోజుల కిందట బళ్లారిలో బియ్యం వ్యాపారి హత్యకు గురయ్యారు. ఈనేపథ్యంలో ఎస్పీ సైదులు అడావత్‌ను బెంగళూరు సెంటర్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రిరిజం ఇంటర్నల్‌ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేశారు. అదే స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న రంజిత్‌కుమార్‌ బండారును బళ్లారి ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రెండు రోజుల్లో ఎస్పీగా రంజిత్‌కుమార్‌ బండారు బాధ్యతలు స్వీకరించనున్నారు.
నూతన ఎస్పీ రంజిత్‌ కుమార్‌ బండారు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని