logo

కనులపండువగా సాంస్కృతిక సంబరం

విజయనగర జిల్లా వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం రంజింపజేశాయి. హగరిబొమ్మన హళ్లి, హొసపేటె, కడ్డిరాంపుర, ధార్వాడ నుంచి కళాకారులు పాల్గొన్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

స్యాక్సోఫోన్‌ వాయిద్యం ద్వారా కర్ణాటక సంగీత కార్యక్రమాన్ని ఇస్తున్న హగరిబొమ్మన హళ్లి కళాకారులు అనన్య, ప్రక్షా

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం రంజింపజేశాయి. హగరిబొమ్మన హళ్లి, హొసపేటె, కడ్డిరాంపుర, ధార్వాడ నుంచి కళాకారులు పాల్గొన్నారు. హగరిబొమ్మన హళ్లి కళాకారులు అనన్య, ప్రక్షాలు స్యాక్సోఫోన్‌ వాయిద్యం ద్వారా ఇచ్చిన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. ధార్వాడ, స్థానిక కళాకారుల సామూహిక నృత్య, భరతనాట్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంత్రి ఆనంద్‌సింగ్‌, డీసీ అనిరుద్ధ్‌ శ్రవణ్‌, ఎస్పీ డాక్టర్‌ కె.అరుణ్‌, జడ్పీ సీఈవో హర్షల్‌ బోయర్‌ చివరిదాకా ఉండి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.


కళాకారుల సామూహిక నృత్య ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని