logo

హక్కుల కోసం ఉద్యమాలు తప్పనిసరి

ప్రజాస్వామ్య భారత దేశంలో హక్కులకోసం ఉద్యమాలు చేయడం తప్పడంలేదని దిల్లీ అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ఆచార్య వెలేరియన్‌ రొడ్రిగస్‌ పేర్కొన్నారు.

Published : 04 Oct 2022 02:18 IST

సదస్సులో ప్రసంగిస్తున్న అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ఆచార్య వెలేరియన్‌ రొడ్రిగస్‌

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య భారత దేశంలో హక్కులకోసం ఉద్యమాలు చేయడం తప్పడంలేదని దిల్లీ అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు ఆచార్య వెలేరియన్‌ రొడ్రిగస్‌ పేర్కొన్నారు. హంపీ కన్నడ వర్సిటీ అభివృద్ధి అధ్యయన విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘అభివృద్ధి రాజకీయం, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగంకన్నా పెద్ద గ్రంథం మరొకటి లేదు. స్వేచ్ఛ జీవితం, సమానత్వం పొందాలంటే పలు సమస్యలు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. రాజకీయం కలుషితమౌతోంది. పెట్టుబడుదారులు, కార్పొరేట్‌ కంపెనీలదే ఇష్టారాజ్యాయంగా మారిందని అన్నారు. ఇతర దేశాల రాజ్యాంగాలను పోల్చుకుంటే మన రాజ్యాంగం చాలా సున్నితం, పదునైందని తేల్చిచెప్పారు. రాజకీయ స్వలాభంతో సమయానికి సరిగ్గా ఎన్నికలు జరగడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమంలో అధ్యయన విభాగం ముఖ్యుడు డాక్టర్‌ ఎ.శ్రీధర్‌, అధ్యాపకుడు డాక్టర్‌ హెచ్‌.డి.ప్రశాంత్‌, డాక్టర్‌ సిద్ధగంగమ్మ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని