logo

జంబూసవారీకి సన్నాహాలు

నవరాత్రి ఉత్సవాలకు బుధవారం తెరపడనుంది. జంబూసవారీని వీక్షించేందుకు కనీసం 15 లక్షల మంది హాజరవుతారని మైసూరు జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది.

Published : 05 Oct 2022 01:10 IST

తన వాహనానికి పూజ చేసుకుంటున్న యదువీర్‌

మైసూరు, న్యూస్‌టుడే : నవరాత్రి ఉత్సవాలకు బుధవారం తెరపడనుంది. జంబూసవారీని వీక్షించేందుకు కనీసం 15 లక్షల మంది హాజరవుతారని మైసూరు జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. వేడుకలను వీక్షించేందుకు ప్రముఖులు, దేశ- విదేశీ పర్యాటకులు ఇప్పటికే రాచనగరికి చేరుకున్నారు. శరన్నవరాత్రుల్లో ఆయుధపూజకు ప్రత్యేకత ఉంది. తమ పరంపరను కొనసాగిస్తూ రాజవంశస్తుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయరు మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆయుధ పూజ నిర్వహించారు. చాముండేశ్వరి ఉత్సవమూర్తితో కొనసాగే పట్టపుటేనుగు అభిమన్యుకు, తమ వాహనాలు, ఆయుధాలకు ఆయన పూజలు చేశారు. ఒంటెలు, గుర్రాలు, పల్లకి, ఆవులనూ అర్చించారు. రాచమందిరంలో చండీహోమాన్ని నిర్వహించారు. కొన్ని ఆయుధాలతో కోడి సోమేశ్వర ఆలయం వరకు ఒడెయరు ఊరేగారు. అక్కడి నుంచి ప్యాలెస్‌లోని కల్యాణ మండపానికి చేరుకుని ఆయుధాలకు పూజ చేశారు. అనంతరమే ప్రైవేటు దర్బార్‌ నిర్వహించారు. మొదటిరోజు కట్టుకున్న కంకణాన్ని అర్చకులు యదువీర్‌ చేతి నుంచి తొలగించారు. దర్బార్‌ మధ్య నుంచి రత్నఖచిత సింహాసనాన్ని పక్కకు జరిపారు. కొద్ది రోజుల అనంతరం సింహాసనాన్ని విడదీసి ఖజానాకు తరలించి భద్రపరుస్తారు.

ప్రజా దర్బార్‌.. ఇక్కడి నుంచే రాజకుటుంబీకులు, ప్రముఖులు జంబూ సవారీ వీక్షణ


జేసీ రోడ్డు కూడలిలో విగ్రహానికి ముస్తాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని