logo

అన్నింటా కన్నడకే పెద్దపీట

కర్ణాటకలో కన్నడ అధికార భాషాభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నట్లు కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు టి.ఎస్‌.నాగభరణ స్పష్టం చేశారు.

Published : 05 Oct 2022 01:10 IST

దసరా వేడుకలు ప్రారంభిస్తున్న నాగభరణ, తదితరులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : కర్ణాటకలో కన్నడ అధికార భాషాభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నట్లు కన్నడ అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు టి.ఎస్‌.నాగభరణ స్పష్టం చేశారు. దసరా పండగ సందర్భంగా మంగళవారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన దసరా సాంస్కృతికోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. నగరంలో స్థిరపడిన వారంతా తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వసల వచ్చి.. స్థిరపడిన ప్రదేశాల్లో ఉండే భాష, సంస్కృతి, సంప్రదాయాలను అందరూ గౌరవించడంతో పాటు ఆచరించాలని సూచించారు. విమానాశ్రయంలో ఆంగ్లంతో పాటు కన్నడ భాషకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇతర భాషల ప్రయాణికులకు కన్నడ భాషకు సంబంధించిన చిరు పుస్తకాలు ఉచితంగా అందజేయాలని ప్రతిపాదించారు. ఈసందర్భంగా యక్షగానం, మహిళల డోలు కుణిత తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విమానాశ్రయం ప్రవేశ మార్గంలో బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు.

డోలుకుణిత నృత్యం చేస్తున్న కళాకారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని