logo

నూతన ఎస్పీ బాధ్యతల స్వీకరణ

జిల్లా నూతన పోలీస్‌ అధికారిగా రంజిత్‌కుమార్‌ బండారు మంగళవారం బదిలీ అయిన ఎస్పీ సైదులు అడావత్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Published : 05 Oct 2022 01:10 IST

సైదులు అడావత్‌ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న రంజిత్‌కుమార్‌ బండారు

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లా నూతన పోలీస్‌ అధికారిగా రంజిత్‌కుమార్‌ బండారు మంగళవారం బదిలీ అయిన ఎస్పీ సైదులు అడావత్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి బళ్లారికి చేరుకున్నారు. తొలుత దుర్గమ్మను దర్శనం చేసుకొని ఎస్పీ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు. రంజిత్‌కుమార్‌ బండారు తెలంగాణ రాష్ట్రం వరంగల్లు జిల్లాకు చెందిన వారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసి, 2008లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల పాటు ఉద్యోగం చేశారు. ప్రారంభం నుంచి సివిల్‌ సర్వీసులో చేరాలని పట్టుదలగా ఉండేది. 2013 మొదటి సారి సివిల్స్‌ పరీక్షలు రాశారు. అనంతరం 2014లో సివిల్స్‌ శిక్షణ కోసం దిల్లీకి వెళ్లారు. 2017లో సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో 555వ ర్యాంకు సాధించారు. కర్ణాటక ఐపీఎస్‌ కేటగిరిలో చేరారు. రాష్ట్రంలో పలు జిల్లాలో శిక్షణ పూర్తి చేశారు. మంగళూరు జిల్లా ఏసీపీగా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు సెంటర్‌ ఫర్‌ కౌంటర్‌ టెర్రిరిజం ఇంటర్నల్‌ సెక్యూరిటీ విభాగంలో ఏసీపీగా పనిచేశారు. ప్రభుత్వం ఆయనను పదోన్నతిపై బళ్లారి ఎస్పీగా నియమించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ నటరాజ్‌, నగర డీఎస్పీ శేఖరప్ప డీఎస్పీలు సత్యనారాయణరావు, కాశీగౌడ, మల్లేశ్‌ దొడ్డమని తదితర పోలీస్‌ అధికారులు కొత్త ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని