logo

ప్రజారోగ్యానికి యశస్విని ఊతం

సహకార సంఘాల సభ్యులు, వారి కుటుంబీకులకు వర్తించే ఆరోగ్య బీమా ‘యశస్విని’ పథకాన్ని నవంబరు ఒకటిన కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా అమలులోకి తేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు.

Published : 07 Oct 2022 02:30 IST

‘జయదేవ ఆసుపత్రి’లో ఉప కేంద్రం వివరాలను
ముఖ్యమంత్రి బొమ్మైకి వివరిస్తున్న డాక్టర్‌ మంజునాథ్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సహకార సంఘాల సభ్యులు, వారి కుటుంబీకులకు వర్తించే ఆరోగ్య బీమా ‘యశస్విని’ పథకాన్ని నవంబరు ఒకటిన కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా అమలులోకి తేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. బెంగళూరులోని కేసీ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, వైద్య విద్య శాఖ సంయుక్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన జయదేవ హృదయ విజ్ఞాన పరిశోధన సంస్థ ఉపకేంద్రం, ఇందిరాగాంధీ బాలల ఆరోగ్య సంస్థ బాలల చికిత్స ఉప కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యశస్విని పథకాన్ని అమలులోకి తెస్తామని ఇప్పటికే హామీనిచ్చామన్నారు. దీని సాయంతో లక్షలాది మంది ప్రయోజనం పొందుతారని వివరించారు. మా ప్రభుత్వం ఆరోగ్యం, విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుందన్నారు. వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను త్వరలో విస్తరిస్తామని చెప్పారు.  కార్యక్రమంలో మంత్రులు డాక్టర్‌ అశ్వత్థనారాయణ, డాక్టర్‌ కె.సుధాకర్‌, శాసనసభ్యుడు దినేశ్‌గుండూరావు, జయదేవ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని