logo

పోరాటాలే జయ కర్ణాటక బలం

కర్ణాటక రాష్ట్ర ప్రత్యేకత, సంస్కృతి, సంప్రదాయాలు, భాష తదితరాలను కాపాడటానికి వివిధ సంఘాలు, సమాఖ్యలు శ్రమించాని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 27 Nov 2022 01:38 IST

కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న చంద్రశేఖర కంబార

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్ర ప్రత్యేకత, సంస్కృతి, సంప్రదాయాలు, భాష తదితరాలను కాపాడటానికి వివిధ సంఘాలు, సమాఖ్యలు శ్రమించాని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పిలుపునిచ్చారు. జయకర్ణాటక సంఘం ప్యాలెస్‌ మైదానంలో శనివారం నిర్వహించిన విశ్వ కన్నడిగుల సమ్మేళనంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి సేవారత్న పురస్కారాలు ప్రదానం చేసి మాట్లాడారు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, దాన్ని కొనసాగించడం సామాన్య విషయం కాదన్నారు. అవినీతికి చోటివ్వకుండా, ప్రజా పోరాటాలు చేసే వందలాది కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతున్న సంఘం అధ్యక్షుడు బి.ఎన్‌.జగదీశ్‌ను ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి డి.వి.సదానందగౌడ, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని