logo

పట్టాలెక్కిన హరిత ప్రాంగణం

ఉద్యాననగరిలో నిర్మించిన సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ స్టేషన్‌ భవనం ‘హరిత ప్రయాణ ప్రాంగణం’ గుర్తింపు దక్కించుకుంది.

Published : 27 Nov 2022 01:38 IST

మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వేస్టేషన్‌ ప్రధాన భవనం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఉద్యాననగరిలో నిర్మించిన సర్‌ ఎం.విశ్వేశ్వరయ్య రైల్వే టర్మినల్‌ స్టేషన్‌ భవనం ‘హరిత ప్రయాణ ప్రాంగణం’ గుర్తింపు దక్కించుకుంది. భారకతీయ హరిత భవన మండలి (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌-ఐజీబీసీ) హరిత రైల్వే స్టేషన్‌గా ఫ్లాటినం పురస్కారాన్ని ప్రకటించింది. ఆధునిక సౌకర్యాలతో పాటు కేంద్రీకృత శీతల వ్యవస్థతో భవనాన్ని నిర్మించగా.. నిరుడు వర్చువల్‌ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడం ప్రస్తావనార్హం. విమానాశ్రయం తరహాలో రూ.275 కోట్ల వ్యయంతో ఈ భవంతిని రైల్వే శాఖ నిర్మించింది. ప్రాంగణం లోపల మొక్కలు పెంచారు. వాననీటి సంరక్షణ చర్యలు ఇక్కడే ఒదిగిపోయాయి. లోపలికి ప్రవేశిస్తే విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని