logo

లారీ ఢీ.. ముగ్గురు దుర్మరణం

హొసదుర్గం తాలూకా కైనదు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

Published : 28 Nov 2022 02:52 IST

ప్రారంభం నుంచి ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.

చెళ్లకెరె(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: హొసదుర్గం తాలూకా కైనదు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు కైనదు గ్రామానికి చెందిన రవికుమార్‌ (29), గిరీశ్‌ (23), ఉజ్జీరప్ప (59)గా గుర్తించారు. హొసదుర్గం నుంచి వీరు ముగ్గురూ ఒకే ద్విచక్ర వాహనంపై కైనదు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదం అనంతరం లారీ చోదకుడు వాహనాన్ని ఆపకుండా వెళ్లాడు. అప్రమత్తమైన స్థానికులు ముందున్న గ్రామంలోని స్నేహితులకు సమాచారం అందించగా వారు సోమసంద్రం వద్ద లారీ అడ్డుకుని, చోదకుడిని పోలీసులకు అప్పగించారు. శ్రీరాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్రవాహనదారుడు..

హొసపేటె, న్యూస్‌టుడే: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహన చోదకుడు రామమూర్తి(46) ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కొట్టూరు తాలూకా కందగల్లువద్ద చోటు చేసుకుంది. అదే తాలూకా హారాళువాసి రామమూర్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వస్థలం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడు కలబురగి జిల్లా కొండగూళి వాసి విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ..

గంగావతి, న్యూస్‌టుడే: రహదారి పక్కన నడచుకుంటూ వెళ్తున్న మహిళపై ట్రాక్టర్‌ బోల్తాపడి మృతి చెందిన సంఘటన గంగావతి పట్టణంలోని కిత్తూరు చెన్నమ్మ కూడలిలో జరిగింది. లింగరాజుక్యాంపునకు చెందిన ముంతాజ్‌బేగం(36) ఓ హోటల్‌లో పని చేస్తుండేది. శనివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి నడకమార్గంలో వెళుతుండగా చెరకు లోడు ట్రాక్టర్‌ ఆమెపై బోల్తా పడింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


ప్రమాదంలో వర్సిటీ ఆచార్యుడు మృతి

ఆచార్య వాసుదేవన్‌ (దాచిన చిత్రం)

హొసపేటె, న్యూస్‌టుడే: దావణగెరె జిల్లా జగళూరువద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హంపీ కన్నడ వర్సిటీ సాంఘిక శాస్త్ర విభాగం ఆచార్య సి.ఎస్‌.వాసుదేవన్‌ దుర్మరణం చెందారు. కారులో ఉన్న ఆయన కుమారుడు డాక్టర్‌ శ్రేయస్‌, మరో ఇద్దరు విద్యార్థినులు నిర్మల, రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. హొరనాడులో జరిగిన చరిత్ర అకాడమీ కార్యక్రమాన్ని ముగించుకుని కారులో తిరిగి హంపీ వర్సిటీ వస్తూ ఆగివున్న లారీని ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ఆచార్య వాసుదేవన్‌ కారు నడుపుతున్నారు. ఆయన మృతికి వర్సిటీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఎన్నో కన్నడ రచనలను ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. కన్నడ వర్సిటీలో తెలుగు భాషపై పట్టున్న అధ్యాపకుల్లో సి.ఎస్‌.వాసుదేవన్‌ ప్రముఖులు. వర్సిటీ
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని