logo

శాస్త్రీయ కళాసంపద..విలువైంది

శాస్త్రీయ కళాసంపద విలువైందని.. భారతీయ కళలు విశ్వఖ్యాతి గడించాయని ఆ కళల్లో నృత్య కళ పేరెన్నికగలదని విశ్రాంత ప్రధానాచార్యుడు డా.హరికుమార్‌ పేర్కొన్నారు.

Published : 29 Nov 2022 01:08 IST

నాట్యవిద్యార్థులకు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేసిన ప్రముఖులు హరికుమార్‌, అభిషేక్‌, ప్రమోద్‌, సునీతలు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: శాస్త్రీయ కళాసంపద విలువైందని.. భారతీయ కళలు విశ్వఖ్యాతి గడించాయని ఆ కళల్లో నృత్య కళ పేరెన్నికగలదని విశ్రాంత ప్రధానాచార్యుడు డా.హరికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం నాట్యార్చన కళాట్రస్ట్‌ ఆధ్వర్యంలో హొంగిరణ రంగభవనంలో కన్నడ రాజ్యోత్సవం, అకాడమీ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్తిక నృత్య సంభ్రమ-2022 అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన సంప్రదాయాలను మరవరాదని, వాటిని ముందుతరాలకు అందించాలన్నారు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న నాట్యాచార్యిణి అర్చన సేవలు అభినందనీయమన్నారు. నాట్యాచార్యుడు అభిషేక్‌ మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యాలను, మన కళా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రదర్శించిన భక్తిమయ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అతిథులు హరికుమార్‌, అభిషేక్‌, నాగభూషణ్‌, సునీతగుండురావు, ప్రమోద్‌లకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నృత్య శిక్షకురాలు అర్చన, వైఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు నాగరాజ్‌గౌడ, నాట్యభారతి ట్రస్ట్‌ అధ్యక్షుడు భీమరావు, కార్యదర్శి వైష్ణవి, జ్యోతిక, గుండురావు, కీర్తన, శ్వేత పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని