రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర సమీపంలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నరేష్
బళ్లారి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగర సమీపంలో జరిగింది. మృతిచెందిన వ్యక్తి నరేష్(29)గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని జోహరిపల్లికి చెందిన నరేష్ బళ్లారి తాలూకా హలకుంది గ్రామంలో ఉంటున్నారు. అక్కడే కొన్ని రోజులపాటు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ప్రస్తుతం ఏ కంపెనీలో పనిచేయడం లేదు. సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై బళ్లారి నగరానికి వస్తుండగా స్థానిక గుగ్గరహట్టి సమీపంలో ఓ ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించేయ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న నరేష్ తలకు బలమైన గాయాలు తగలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న బళ్లారి ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విమ్స్‌కు తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: వరదరాజస్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేకపూజలు
-
Politics News
Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత