logo

వైభవంగా కనకదాస జయంతి

సింధనూరు తాలూకా కురుబ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో కనకదాస జయంతి అంగరంగ వైభవంగా జరిగింది.

Published : 30 Nov 2022 00:38 IST

తెక్కెలకోటలో ఊరేగింపులో పాల్గొన్న సమాజం సభ్యులు

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు తాలూకా కురుబ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో కనకదాస జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటాన్ని ఘనంగా ఊరేగించారు. మేళతాళాలు, భాజాభజంత్రీలు, కళాబృందాల ప్రదర్శనలతో పట్టణ ప్రధాన దారులు మారుమోగాయి. వందలసంఖ్యలో మహిళలు తలపై కలశాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ ఊరేగింపు కారణంగా పట్టణంలో దాదాపు రెండు గంటలపాటు వాహనసంచారం గాడితప్పింది. వాసవీ కల్యాణ మంటపం నుంచి కుష్టిగి మార్గంలోని కనకదాస కల్యాణ మంటపం వరకూ ఊరేగింపు సాగింది. కురుబ సమాజం గురువులు, మస్కి ఎమ్మెల్యే ఆర్‌.బసనగౌడ, కపెక్‌ అధ్యక్షుడు కె.విరుపాక్షప్ప, మస్కి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ, కాంగ్రెస్‌ నాయకులు కె.కరియప్ప, బసనగౌడ బాదర్లి, జేడీఎస్‌ నాయకుడు అభిషేక్‌ నాడగౌడ వేడుకలో పాల్గొన్నారు.

కనకదాస విగ్రహం ఎదుట కళాబృందాల ప్రదర్శన

సంకీర్తనలతో ఉత్తమ సమాజం

సిరుగుప్ప, న్యూస్‌టుడే: కనకదాస అందించిన సంకీర్తనలతో ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని హాలుమత సమాజం తెక్కెలకోట ప్రతినిధి నెణికెప్ప పేర్కొన్నారు. తెక్కెలకోటలో మంగళవారం కనకదాస జయంతిని చిత్రపటానికి పూల మాల వేసి ప్రారంభించారు. శ్రీ కాడసిద్దేశ్వర దేవాలయం నుంచి ప్రధాన రహదారి, కూడళ్ల మీదుగా కనకదాస కూడలి వరకు ఊరేగింపు నిర్వహించారు. ప్రతినిధులు బీరప్ప, కేశవ, అయ్యప్ప, రమేష్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని