logo

కార్తికేయ క్షేత్రాలు కిటకిట

సుబ్రహ్మణ్య షష్ఠి చంద్రమౌళేశ్వర పూజ తదితరాలను పురస్కరించుకుని కుక్కె సుబ్రహ్మణ్యకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మరథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Published : 30 Nov 2022 00:38 IST

కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్ర వీధుల్లో రథోత్సవ వైభవం

మంగళూరు, న్యూస్‌టుడే : సుబ్రహ్మణ్య షష్ఠి చంద్రమౌళేశ్వర పూజ తదితరాలను పురస్కరించుకుని కుక్కె సుబ్రహ్మణ్యకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మరథోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచమి రథంలో ఉమామహేశ్వరుని దేవతా మూర్తులను ఊరేగించారు. విదేశాల నుంచి వచ్చిన కొందరు భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను కల్పించారు.

బెంగళూరులో ఆందోళన

బెంగళూరు విపుపురం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన బ్రహ్మ రజత రథోత్సవంలో ఇతర ధర్మాలకు చెందిన వారు వ్యాపారం చేసుకోకుండా కొందరు అడ్డుపడ్డారు. వారిలో ఎక్కువ మంది ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా కార్యకర్తలు ఉన్నారు. అన్ని ధర్మాల వారికి వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇస్తామని ఎమ్మెల్యే ఉదయ్‌ గరుడాచార్‌ ప్రకటించిన తర్వాత కూడా కొన్ని హిందూ సంస్థల ప్రతినిధులు కొందరు వ్యాపారులను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. బాధిత వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదులతో పాతిక మంది పైచిలుకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని