logo

‘ఫసల్‌ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి’

పంట నష్టం సమయాల్లో అన్నదాతలను ఆదుకునే ప్రధాన మంత్రి ఫసల్‌బీమా పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి టి.వెంకటేష్‌ పిలుపునిచ్చారు.

Published : 02 Dec 2022 01:22 IST

ప్రధాన మంత్రి ఫసల్‌బీమా ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్న పాలనాధికారి వెంకటేష్‌

హొసపేటె, న్యూస్‌టుడే: పంట నష్టం సమయాల్లో అన్నదాతలను ఆదుకునే ప్రధాన మంత్రి ఫసల్‌బీమా పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి టి.వెంకటేష్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయం వద్ద ఫసల్‌ బీమా పథకం ప్రచార వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో పంట నష్టంతో రైతులు లబోదిబోమనడంకన్నా, ముందుగానే పంట బీమా చేయించుకోవడం శ్రేయస్కరమని స్పష్టం చేశారు. పథకం అమలులోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రైతులు నిరాసక్తి చూపడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదికి కొంత మొత్తాన్ని చెల్లించి బీమా చేయించుకుంటే ఆపదలో ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు శరణప్ప ముదగల్లు మాట్లాడుతూ పంటల బీమా పథకంపై విస్తృత ప్రచారం కోసం వాహనాన్ని సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని అన్ని తాలూకాల్లో ఈ వాహనం సంచరించి రైతులకు అవగాహన కల్పిస్తుందని వివరించారు. వాహనం వెంట వచ్చే వ్యవసాయ శాఖ నిపుణులు రైతుల్లో అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకుడు కె.వామదేవ, ఉద్యానవన ఉపసంచాలకుడు శంకర్‌, వ్యవసాయ అధికారి వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని