logo

Crime News: కోడలిపై కన్నేసి.. కడతేరి పోయాడు

‘నీ భర్తతో నీకు సంతానం కలగదు. నా కోరిక తీర్చు. సంతానవతిని చేస్తా..’ అంటూ మామ తమ్మేగౌడ (55) పెట్టే వేధింపులను ఆ గృహిణి (30) తట్టుకోలేకపోయింది.

Updated : 04 Dec 2022 10:20 IST

హాసన, న్యూస్‌టుడే : ‘నీ భర్తతో నీకు సంతానం కలగదు. నా కోరిక తీర్చు. సంతానవతిని చేస్తా..’ అంటూ మామ తమ్మేగౌడ (55) పెట్టే వేధింపులను ఆ గృహిణి (30) తట్టుకోలేకపోయింది. పెళ్లయి ఐదేళ్లయినా నువ్వు సంతానవతివి కాలేదంటూ, కుదిరినప్పుడల్లా ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఆయన వేధింపులను తట్టుకోలేక ఆ గృహిణి సిగ్గువిడిచి తన తల్లిదండ్రుల వద్ద కష్టం చెప్పుకొంది. తమ్మేగౌడకు మంచిగా చెబితే వినడని గుర్తించిన ఆ గృహిణి తల్లిదండ్రులు అతన్ని హత్య చేయించేందుకు పథకాన్ని రూపొందించారు. హాసన జిల్లా హొళెనరసీపుర ఠాణా పరిధిలోని తమ ఇంటికి వియ్యంకుడిని నవంబరు 13న పిలిపించి మద్యం, మాంసంతో విందు ఇచ్చారు. అతను మత్తులోకి జారుకున్న తర్వాత తాము ముందుగా రూ.50 వేలు కిరాయి ఇచ్చిన యువకులను ఇంటికి పిలిపించుకున్నారు. ఇనుప రాడ్‌తో అతనిపై దాడి చేసి కడతేర్చారు. మృతదేహాన్ని ఊరవతల పడేశారు. మృతుని మూడో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ గృహిణి తల్లిదండ్రులు మైలారగౌడ, తాయమ్మను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుపారీ హంతకుల కోసం హొళెనరసీపుర ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని