వాయుదళానికి చక్కని శిక్షణ
భారత వాయుదళానికి చెందిన ‘బెంగళూరు శిక్షణ కేంద్రం’లో శనివారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి పాల్గొని పలు అంశాలపై విశ్లేషించారు.
గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తున్న వాయుసేన అధికారి
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : భారత వాయుదళానికి చెందిన ‘బెంగళూరు శిక్షణ కేంద్రం’లో శనివారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌధరి పాల్గొని పలు అంశాలపై విశ్లేషించారు. శిక్షణ కేంద్రంలో అందుతున్న సేవలు, శిక్షణ రీతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సాంకేతికత అంశాలు తదితర వివరాలను ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆయనకు వివరించారు. అగ్నివీరుల విభాగానికి డిసెంబరు 30 నుంచి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మానవేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ సమయంలో ఎదురయ్యే సమస్యలను సవాలుగా తీసుకుని పరిష్కరించాలని వి.ఆర్.చౌధరి సూచించారు. ఇక్కడి శిక్షణ కేంద్రానికి అత్యుత్తమ ఏరోస్పేస్ సేఫ్టీ రికార్డు ఉందని ప్రశంసించారు. భారతీయ వాయుదళానికి ఈ ప్రధాన శిక్షణ కేంద్రం అందిస్తున్న సేవలు అత్యుత్తమమైనవి అని పేర్కొన్నారు.
లక్ష్యసేన్‌పై ఫిర్యాదు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : అర్జున పురస్కార గ్రహీత, అంతర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ వంచనకు పాల్పడ్డారని హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వయసుకు సంబంధించి తప్పుడు దాఖలాలు ఇచ్చారని బెంగళూరు బ్యాడ్మింటన్ అకాడమీ యజమాని నాగరాజు ఫిర్యాదు చేశారు. లక్ష్యసేన్ 1998లో జన్మించారు. ప్రభుత్వం, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్‌లో సదుపాయాలను అందుకునేందుకు అనుగుణంగా తాను 2001లో పుట్టానని ప్రమాణపత్రాన్ని ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా లక్ష్య సేన్, అతని తల్లిదండ్రులు ధీరేంద్ర కుమార్ సేన్, నిర్మలా సేన్, సోదరుడు చిరాగ్ సేన్, తర్ఫీదుదారుడు విమల్ కుమార్‌లను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ వస్తున్న వి.ఆర్.చౌధరి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా