logo

బంగారం ఇస్త్రీ పెట్టె!

ఇస్త్రీ పెట్టె లోపల బంగారు రేకులను ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న ఒక యువకుడిని (22) బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 04 Dec 2022 01:41 IST

ఇస్త్రీ పెట్టెలో బంగారు రేకులు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ఇస్త్రీ పెట్టె లోపల బంగారు రేకులను ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న ఒక యువకుడిని (22) బెంగళూరు విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఆ యువకుడు ఇస్త్రీ పెట్టెలో ఒక్కోటి సుమారు కిలోన్నర బరువు ఉండే అపరంజి రేకులను స్వాధీనపరుచుకున్నారు. దీని విలువ రూ.1.60 కోట్లుగా అంచనా వేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు బాధ్యతలను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులకు అప్పగించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని