logo

దివ్యాంగులకు సర్కారు చేయూత

అందరితో కలిసి జీవనం సాగించేలా దివ్యాంగ బాలలకు రూ.5లక్షలతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు.

Published : 04 Dec 2022 01:41 IST

బధిర బాలలను ఆశీర్వదిస్తున్న బసవరాజ బొమ్మై

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అందరితో కలిసి జీవనం సాగించేలా దివ్యాంగ బాలలకు రూ.5లక్షలతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో సంబంధిత శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం అమలుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్మించి కేటాయించే వసతి గృహాల్లో మూడు శాతం దివ్యాంగులకే కేటాయిస్తామని ప్రకటించారు. బాలలకు ఇచ్చే సైకిళ్ల కోసం అదనంగా రూ.28 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దేవుడు పిల్లలను సృష్టించే సమయంలో ఒక్కొక్కొరిలో ఒక సమస్య ఉంచారని, శరీరంలో అన్నీ సక్రమంగా లేకపోవడాన్ని సవాలుగా తీసుకుని అధిగమించాలన్నారు. దివ్యాంగులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ జీవన యాత్ర సాగిస్తున్నారని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి తిలకించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి హలప్ప ఆచార్‌, ఎంపీ పీసీమోహన్‌, శాసనసభ్యుడు రిజ్వాన్‌ హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.

కళా సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని