logo

భక్తిశ్రద్ధలతో గీతా పారాయణ

మిస్సెస్‌ కెప్టెన్‌ మహిళా మండలి, రాష్ట్ర జాగృతి అభియానా సంయుక్తంగా శనివారం ఉదయం కోర్టు రహదారిలోని కెప్టెన్‌  ఆవరణలో గీతా జయంతి సందర్భంగా సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు.

Published : 04 Dec 2022 01:41 IST

బళ్లారి: పూలమాల వేస్తున్న రామకృష్ణ వివేకానంద కేంద్రం బ్రహ్మచారి కిరణ్‌కృష్ణస్వామీజీ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: మిస్సెస్‌ కెప్టెన్‌ మహిళా మండలి, రాష్ట్ర జాగృతి అభియానా సంయుక్తంగా శనివారం ఉదయం కోర్టు రహదారిలోని కెప్టెన్‌  ఆవరణలో గీతా జయంతి సందర్భంగా సామూహిక గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. 13 పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌కుమార్‌, ముఖ్య అతిథిగా రామకృష్ణ వివేకానంద కేంద్రం బ్రహ్మచారి కిరణ్‌కృష్ణస్వామీజీ, మిస్సెస్‌ కెప్టెన్‌ మహిళా మండలి అధ్యక్షురాలు అల్లం సునంద పాల్గొని మాట్లాడారు. భగవద్గీత పుస్తకాలు పఠనం చేయడం వల్ల జ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. జీవితంలో కష్ట, సుఖాలు, బాధ్యత వంటి విషయాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమానికి కార్యదర్శి రమాదేవి, అల్లం దొడ్డన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: గీతాసేవాట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామాంజినేయనగర్‌ గీతామందిరంలో శనివారం భగవద్గీత ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిద్దాత్మానంద సరస్వతి మాతాజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మందిరం వార్షికోతవాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణునికి అభిషేకాలు చేసి అలంకరించారు. భక్తులు సామూహికంగా గీతాపఠనం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ ప్రముఖులు జానకీరామ్‌, వెంకటరమణ పాల్గొన్నారు.  

సింధనూరు: సింధనూరు-మస్కి మార్గంలోని పగడదిన్నిక్యాంపులో భక్తులు గీతా జయంతిని పురస్కరించుకుని శనివారం రెండు రోజుల పారాయణం ప్రారంభించారు. క్యాంపులోని శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం ధ్వజారోహణ చేసి కైంకర్యాలు ప్రారంభించారు. భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు సేవా సమితి జిల్లా ముఖ్యుడు బోసుబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని