logo

నాకేం బాధలేదు

ముఖ్యమంత్రిగా ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుగా అనేక మంది ప్రజలు తనను అన్నరామయ్య, రైతు రామయ్య, కన్నడ రామయ్య, దళిత రామయ్య అని సంబోధిస్తూ పలకరించేవారని, అదే విధంగా ముస్లింలకు చేసిన సేవలను గుర్తించి తనను సిద్రముల్లాఖాన్‌ అని పిలిస్తే తాను సంతోషిస్తానని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 08 Dec 2022 01:52 IST

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుగా అనేక మంది ప్రజలు తనను అన్నరామయ్య, రైతు రామయ్య, కన్నడ రామయ్య, దళిత రామయ్య అని సంబోధిస్తూ పలకరించేవారని, అదే విధంగా ముస్లింలకు చేసిన సేవలను గుర్తించి తనను సిద్రముల్లాఖాన్‌ అని పిలిస్తే తాను సంతోషిస్తానని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. సిద్రమూల్లాఖాన్‌ అని తన పేరు ముందు ముస్లిం పేరు చేర్పించడం పట్ల తనకు ఎలాంటి బాధ లేదని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ముస్లిం కుటుంబంలో పుట్టి గోవింద భట్టరు శిష్యుడు అయిన సంతె శిశునాళ్‌ షరీఫ్‌ పరంపర తమదన్నారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన కవి కబీర్‌, సంతె రమానంద శిష్యుడిగా ఖ్యాతి పొందారని,ముస్లిం పేరును తన పేరుకు జోడించడం ద్వారా లౌకికవాదంపై ఉన్న నమ్మకాన్ని పునద్ధరించారని గుర్తు చేశారు. హిందూ, ముస్లిం మతాల్లో ఉన్న మతతత్వ వాదులను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నానని గుర్తు చేశారు. భాజపాలో మంచి చెడ్డ వారు అనే తేడా లేకుండా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టిప్పు సుల్తాన్‌ జయంతిని లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా భాజపా సంఘపరివార్‌ వివాదాలు సృష్టించడంతో పాటు ఘర్షణలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధిపొందుతున్నారని సిద్ధు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని