logo

శుభకార్యానికి వెళ్తూ.. సీఐ దంపతుల విషాదాంతం

జీవర్గి తాలూకా నేలోగి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్‌ రవి ఉక్కుంద (40) ఆయన భార్య మధుకుమారి (35) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 08 Dec 2022 06:04 IST

కుటుంబ సభ్యులతో సీఐ రవి ఉక్కుంద (పాతచిత్రం)

జీవర్గి,(మాన్వి) : జీవర్గి తాలూకా నేలోగి ఠాణా పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇన్‌స్పెక్టర్‌ రవి ఉక్కుంద (40) ఆయన భార్య మధుకుమారి (35) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. విజయపుర జిల్లా సింధగి ఠాణాలో సీఐగా విధులు నిర్వహిస్తున్న రవి ఉక్కుంద తన భార్యతో కలిసి కారులో కలబురగికి వెళ్తుండగా జీవర్గి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటైనర్‌ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరిద్దరూ తమ పిల్లలు అదితి (6), ఆర్యన్‌ (8)లను విజయపురలోని ఓ పాఠశాలలో వదిలేసి కలబురగిలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.

మాన్వి తాలూకాలో సన్నిహితులు

రవి సొంతూరు దావణగెరె జిల్లా రాణేబెన్నూరు తాలూకా అరళికట్టి. ఆయనకు మాన్వి తాలూకాలో సన్నిహితులు ఉన్నారు. తాలూకాలోని కవితాళ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఎస్సైగా విధులు నిర్వహించారు. భార్య మధుకుమారి ఇళకల్‌ తాలూకా చిన్నాపూర్‌(ఎస్‌.కె)కు చెందినవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని