logo

విన్యాసం.. సంభ్రమాశ్చర్యం

రక్షణ శాఖకు సుశిక్షుతులైన సిబ్బందిని అందించే ఏఎస్సీ సెంటర్‌, కళాశాల 11వ రీయూనియన్‌ కార్యక్రమాలు, 262వ కార్ప్స్‌డే కార్యక్రమాలు బుధవారం ఘనంగా ప్రారంభమమయ్యాయి.

Published : 08 Dec 2022 01:52 IST

ఘనంగా రీయూనియన్‌ కార్యక్రమం

అమరవీరులకు నివాళి అర్పిస్తున్న అధికారి ఎం.కె.ఎస్‌.యాదవ్‌

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: రక్షణ శాఖకు సుశిక్షుతులైన సిబ్బందిని అందించే ఏఎస్సీ సెంటర్‌, కళాశాల 11వ రీయూనియన్‌ కార్యక్రమాలు, 262వ కార్ప్స్‌డే కార్యక్రమాలు బుధవారం ఘనంగా ప్రారంభమమయ్యాయి. వివిధ దళాలకు చెందిన సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యాసాలు, ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ యుద్ధాలలో అమరులైన సైనికులు, సీనియరు అధికారుల స్మారకం వద్ద అధికారులు మనోజ్‌ కుమార్‌ సింగ్‌ యాదవ్‌, బి.కె.రెప్స్‌వాల్‌ నివాళి అర్పించారు. నేడు, రేపు (గురు, శుక్ర) అశ్విక దళాలు, వైమానిక సిబ్బంది, ప్యారాచూట్ విభాగం సిబ్బంది అభ్యాస విన్యాసాలు చేపట్టారు. ఏఎస్సీ కళాశాలలో శిక్షణ పొందుతున్న సిబ్బంది, రక్షణశాఖకు చెందిన సైనికులు, సారంగ్‌ విమానాలను నడిపే భారతీయ వాయుదళానికి చెందిన పైలెట్లు ఈ అభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియరు అధికారులు, కళాశాల సిబ్బంది ఈ దళాల విన్యాసాలను పరిశీలించారు.


ఆకాశంలో లోహ విహంగాల ప్రదర్శన

గుర్రాలపై నిలబడిన అశ్వికదళ సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని