logo

సిద్ధరామయ్య బదులివ్వాలి

తాను నిజాయతీపరుడినని ప్రతిసారీ గొప్పలు చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని భాజపా దక్షిణ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌.రమేశ్‌ ఆరోపించారు.

Published : 08 Dec 2022 01:52 IST

పత్రాలు చూపిస్తూ మాట్లాడుతున్న రమేశ్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: తాను నిజాయతీపరుడినని ప్రతిసారీ గొప్పలు చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని భాజపా దక్షిణ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎన్‌.ఆర్‌.రమేశ్‌ ఆరోపించారు. తన శిష్యుని ద్వారా డీనోటిఫికేషన్‌ చేయించుకుని, అది తన తప్పుకాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైసూరు విజయనగరలో 1997లో 9,600 చ.అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిని కేవలం రూ.6.72 లక్షలకు కొనుగోలు చేసిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆరేళ్లకు ఆ భూమిని రూ.ఒక కోటికి విక్రయించే సమయంలో పలు నిబంధనలు ఉల్లంఘించారంటూ కొన్ని పత్రాలను ప్రదర్శించారు. ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న భూమిని అప్పటి ముడా అధ్యక్షుడు సి.బసవేగౌడతో డీనోటిఫికేషన్‌ చేయించుకుని, విక్రయించారని ఆరోపించారు. తన ప్రశ్నలకు బదులిచ్చిన తర్వాతే, ఇతరులపై ఆరోపణలు చేయాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని