logo

పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు

పద్దెమిదేళ్లు నిండని, చోదక అనుమతి పత్రం లేని పిల్లలకు ద్విచక్ర వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు జరిమానా విధిస్తామని విజయనగర ఎస్పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు.

Published : 08 Dec 2022 01:52 IST

వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ శ్రీహరిబాబు, ఆర్టీవో వసంత్‌ ఈశ్వర్‌ చవాణ్‌

హొసపేటె, న్యూస్‌టుడే: పద్దెమిదేళ్లు నిండని, చోదక అనుమతి పత్రం లేని పిల్లలకు ద్విచక్ర వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు జరిమానా విధిస్తామని విజయనగర ఎస్పీ శ్రీహరిబాబు పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, ఆర్టీవో కార్యాలయాలు సంయుక్తంగా బుధవారం రహదారి భద్రత జాగృతి వాహనాన్ని ఆర్టీవో వసంత్‌ ఈశ్వర్‌ చవాణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిల్లల చేతికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు న్యాయస్థానంలో కనీసం రూ.25వేల దాకా జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రహదారి ప్రమాదాల్లో పద్దెనిమిదేళ్లు నిండని పిల్లలు ఎక్కువగా మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఆర్టీవో వసంత్‌ ఈశ్వర్‌ చవాణ్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ నియమాల పాలన, చోదకులు పాటించే జాగ్రత్తలు తదితర విషయాలపై రవాణా ప్రాధికారం వారు ఎల్‌ఈడీ వాహనాన్ని సిద్ధం చేశారు. ఆ వాహనం పట్టణంలోని ప్రతి కూడలికి వెళ్లి అక్కడ ప్రమాదాల నియంత్రణపై 20 నిమిషాల బుల్లిచిత్రాన్ని ప్రదర్శిస్తుందన్నారు. డీఎస్పీ విశ్వనాథరావు కులకర్ణి, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ మేటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని