ఉక్కునగరి.. ఉత్సవ భేరి
బళ్లారి ఉత్సవంతో నగరానికి కొత్త శోభ వచ్చింది. ప్రభుత్వ మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానంలో ఫలపుష్ప ప్రదర్శన, మత్స్య, ఆహార మేళ, సైకత శిల్పాలు, మెహంది, వ్యవసాయ మేళాను తిలకించడానికి బళ్లారి జిల్లా నుంచే కాకుండా సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీగా జనం తరలివచ్చారు.
ఫల పుష్పాలతో కాంతార చిత్రం సన్నివేశం..
బళ్లారి, న్యూస్‌టుడే : బళ్లారి ఉత్సవంతో నగరానికి కొత్త శోభ వచ్చింది. ప్రభుత్వ మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానంలో ఫలపుష్ప ప్రదర్శన, మత్స్య, ఆహార మేళ, సైకత శిల్పాలు, మెహంది, వ్యవసాయ మేళాను తిలకించడానికి బళ్లారి జిల్లా నుంచే కాకుండా సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీగా జనం తరలివచ్చారు. మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. జిల్లా సంకీర్ణ భవనం ఆవరణలో బైక్ స్టంట్, విమ్స్ క్రీడా మైదానంలో పురుషులు, మహిళలు కబడ్డీ పోటీలు, బళ్లారి కొండపై సాహస క్రీడలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న ఫలపుష్ప ప్రదర్శన
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బళ్లారి ప్రభుత్వ పదవీ పూర్వ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను జిల్లా మంత్రి బి.శ్రీరాములు ప్రారంభించి మాట్లాడారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో మాదిరిగా ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారని అధికారులను అభినందించారు. ఈ ప్రదర్శన బళ్లారి ఉత్సవానికి అందాన్ని తెచ్చిందన్నారు. వివిధ ఫలాలపై రూపొందించిన ప్రముఖుల చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఫల పుష్ప ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, పక్కన శాసనసభ్యుడు
గాలి సోమశేఖర్‌రెడ్డి, డీసీ పవన్‌కుమార్ తదితరులు
మగువల మదిని దోచిన మెహంది
మెహంది మేళాను మేయరు మోదపల్లి రాజేశ్వరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సకీనా, చిన్నపిల్లల వైద్యురాలు డా.మోహన యలవర్తి పవన్‌కుమార్ మాలపాటి ప్రారంభించారు. మెహంది పోటీల్లో 70 మందికిపైగా మహిళలు, యువతులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1 వేలు నగదు బహుమతి అందజేశారు. శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తిగొలిపిన మత్య్సమేళా
మృత్స్య మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన పెద్ద అక్వేరియంలోని వివిధ రకాల రంగుల చేపలను యువతి, యువకులు ఆసక్తిగా తిలకించారు. వాటిని తమ చరవాణిలో బంధించి ఆనందించారు. అక్కడ రూపొందించిన సైకత శిల్పాల ప్రదర్శన విశేషంగా నిలిచింది. ఈ ప్రదర్శనను సిరుగుప్ప శాసనసభ్యుడు సోమలింగప్ప ప్రారంభించారు.
మంగ్లీ బృందంచే గానం
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
జిల్లా యువ సబలీకరణ, క్రీడా శాఖ ఆధ్వర్యంలో విమ్స్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 33 పురుషులు, మహిళల జట్లు పాల్గొన్నాయి. పోటీలను తిలకించడానికి ప్రజలు తరలివచ్చారు.
అబ్బురపరిచిన బైక్ స్టంట్
జిల్లా సంకీర్ణ భవనం ఆవరణలో బైక్స్టంట్ విశేషంగా నిలిచింది. అనుభవం పొందిన రైడర్లు చేసిన సాహస విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బళ్లారి కొండపై సాహస క్రీడా ప్యారా సీలింగ్ పోటీలు అలరించాయి. బండరాయిపై తాడు సహాయంతో పైకి ఎక్కడం వంటి ప్రదర్శనలు నిర్వహించారు.
చిరుధాన్యాల ప్రదర్శన
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రదర్శన, వ్యవసాయానికి వినియోగించే పరికరాలు, నాగలి, ఎడ్లు బండి, జలాశయాలు, చెక్ డ్యామ్‌లు, బిందు సేద్యంతో పండ్ల తోటల సాగు, సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి, ఇంకుడు గుంతలు తదితర వాటిని ప్రదర్శనలో ఉంచారు.
మత్స్య మేళాలో యువతుల స్వీయ చిత్రం
ఏటా ఉత్సవం నిర్వహించాలి
బళ్లారి : రాష్ట్రంలో జరిగే హంపీ.. కదంబ.. పురంధరదాసర ఉత్సవాల మాదిరిగానే బళ్లారి ఉత్సవం నిరంతరం కొనసాగించాలని మంత్రి బి.శ్రీరాములు కోరారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక డా.రాజ్‌కుమార్ రహదారిలోని ప్రభుత్వ మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన బళ్లారి ఉత్సవాన్ని అశ్విని పునీత్రాజ్కుమార్తో కలిసి మంత్రి బి.శ్రీరాములు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో ఉత్సవానికి రాలేక పోయారని సందేశం పంపారన్నారు.
ఉత్సవానికి కాంగ్రెస్ శాసనసభ్యులు దూరం
బళ్లారి ఉత్సవంకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బి.నాగేంద్ర, ఇ.తుకారాం, గణేష్ దూరంగా ఉన్నారు. సిరుగుప్ప శాసనసభ్యుడు ఎం.ఎస్.సోమలింగప్ప కూడా వేదికపై కనిపించలేదు. లోక్‌సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్ నాసీర్ హుసేన్ కూడా వేదికపై కనిపించలేదు. కార్యక్రమంలో శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, మేయర్ మోదపల్లి రాజేశ్వరి, బుడా అధ్యక్షుడు మారతి ప్రసాద్,డీసీ పవన్‌కుమార్ మాలపాటి, ఐజీ లోకేష్‌కుమార్, ఎస్పీ రంజిత్‌కుమార్ బండారు, పాలికె కమిషనర్ రుద్రేశ్ తదితరులు ఉన్నారు.
పునీత్‌రాజ్‌కుమార్ విగ్రహావిష్కరణ
నగరంలోని జిల్లా క్రీడామైదానం ఎదుట ఏర్పాటు చేసిన చెరువు వద్ద పునీత్‌రాజ్‌కుమార్ విగ్రహాన్ని మంత్రి బి.శ్రీరాములతోపాటు, కన్నడ చలన చిత్ర నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, అశ్విని పునీత్‌కుమార్, డీసీ పవన్‌కుమార్ మాలపాటి, ఎప్పీ రంజిత్‌కుమార్ బండారు పాల్గొని ప్రారంభించారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ పునీత్ మన ముందు లేక పోయినా.. ఆయన చేసిన సేవ కార్యక్రమాలతో ప్రజలు దేవుడితో సమానంగా ఆరాధిస్తున్నారని తెలిపారు. పునీత్‌రాజ్‌కుమార్ విగ్రహం ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు.
పోటెత్తిన జన సాగరం
మున్సిపల్ పదవీ పూర్వ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన బళ్లారి ఉత్సవానికి జనం పోటెత్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. పోలీసులు నియంత్రించలేకపోయారు. హెచ్.ఆర్.గవియప్ప కూడలి నుంచి గడిగిచెన్నప్ప కూడలి, డా.రాజ్‌కుమార్ రహదారి, సత్యనారాయణపెటె, ఇందిరానగర్ తదితర ప్రాంతాలు జనంతో రద్దీగా మారిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇందు శ్రీ మిమిక్రీ, గంగావతి హస్య ప్రదర్శన, చిన్నారులు నృత్య ప్రదర్శన అలరించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!