పోరాటాలతోనే దారికొస్తుంది
ఆర్ఎస్ఎస్ కన్నుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందని, ప్రజలపై మత రాజకీయాలను బలవంతంగా రుద్దుతోందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మండిపడ్డారు.
సీఐటీయూ నేతల పునరుద్ఘాటన
నగరా మోగించి బహిరంగ సభను ప్రారంభిస్తున్న సీఐటీయూ నేతలు
డాక్టర్ హేమలత, తపన్‌సేన్, వరలక్ష్మి, మీనాక్షి సుందరం, తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఆర్ఎస్ఎస్ కన్నుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందని, ప్రజలపై మత రాజకీయాలను బలవంతంగా రుద్దుతోందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మండిపడ్డారు. ప్రజల ఆదాయం తక్కువై వీధినపడుతున్నారని, మాటలతో చెబితే ఈ ప్రభుత్వం వినడం లేదని, పోరాటాలు తీవ్రతరం చేస్తేనే దారికి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 18 నుంచి నగరంలో కొనసాగుతున్న సీఐటీయూ 17వ జాతీయ మహాసభలు ఆదివారం ముగింపు సందర్భంగా బసవనగుడి నేషనల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భాజపా ప్రభుత్వం విధానాలతో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని, ప్రజలను పట్టపగలు హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో ఖాళీ ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ఉపాధి లేక యువత వివిధ సమస్యల్లో కూరుకుపోతున్నారని, అన్నింటిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు నిరంతరం పోరాటాలు చేస్తున్న పాలకులు వారి డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మధ్య మతం పేరుతో విభజనలు తెచ్చే మతతత్వ శక్తులను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు కాషాయ పాలకులు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సంస్థ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, రాష్ట్ర అధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మీనాక్షిసుందరం పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Politics News
Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌తో చేయి కలపాలి: మాణిక్ రావ్ ఠాక్రే
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!