logo

పాక్‌ యువతి అక్రమప్రవేశం

భారతదేశంలోకి అక్రమంగా వచ్చి బెంగళూరులో ఉంటున్న ఇక్రా జీవని (19) అనే పాక్‌ యువతిని, ములాయం సింగ్‌ (26) అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని బెళ్లందూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 24 Jan 2023 06:22 IST

సహజీవనం సాగించిన యువకుడికి కటకటాలు

బెళ్లందూరు పోలీసులు అరెస్టు చేసిన పాక్‌ యువతి, యూపీ యువకుడు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : భారతదేశంలోకి అక్రమంగా వచ్చి బెంగళూరులో ఉంటున్న ఇక్రా జీవని (19) అనే పాక్‌ యువతిని, ములాయం సింగ్‌ (26) అనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని బెళ్లందూరు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు పరిశీలించకుండా వారికి ఇంటిని బాడుగకు ఇచ్చిన గోవిందరెడ్డి అనే వ్యక్తిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ములాయం సింగ్‌ కొన్నేళ్లుగా హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్లోని ఒక సంస్థలో కాపలాదారు. గేమింగ్‌ యాప్‌ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమెను నేపాల్‌ వరకు విమానంలో పిలిపించుకుని, అక్కడి నుంచి అక్రమ మార్గంలో సరిహద్దు దాటించి, బెంగళూరుకు గత ఏడాది సెప్టెంబరులో తీసుకు వచ్చాడు. ఇద్దరూ లేబర్‌ క్వార్టర్స్‌లో సహ జీవనాన్ని ప్రారంభించారు. కొద్ది రోజుల కిందట పాక్‌లో ఉన్న తన తల్లితో ఇక్రా ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కాల్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. వారి కోసం వేటసాగించి ఇన్నాళ్లకు అరెస్టు చేశారు. యువతిని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయానికి అప్పగించారు. ఆమె పేరును రావా యాదవ్‌గా మార్చుకుని, కొత్త పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని వైట్ఫీల్డ్‌ విభాగం డీసీపీ గిరీశ్‌ తెలిపారు. తదుపరి విచారణలో మరికొన్ని వివరాలు బయటపడతాయని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని