logo

నిజాయితీకి నీడ కరవు

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని మాజీ లోకాయుక్త జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే అభిప్రాయపడ్డారు.

Updated : 25 Jan 2023 05:18 IST

జస్టిస్‌ సంతోష్‌హెగ్డే వ్యాఖ్య

మైసూరు, న్యూస్‌టుడే : సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని మాజీ లోకాయుక్త జస్టిస్‌ సంతోశ్‌ హెగ్డే అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కొలీజియం నిర్వహణ చక్కగా ఉందన్నారు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీ ప్రక్రియలో కేంద్రం జోక్యం అవసరం లేదన్నారు. ధర్మం, భాష విషయంలో దేశ ప్రజలు విడిపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలలో అవినీతి తాండవమాడుతోందని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు తమకు తామే ప్రజలకు యజమానులమని భావించుకుంటున్నారని విమర్శించారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్న రాజకీయ నాయకులు, అవినీతిపరులను అరెస్టు చేసి కారాగారానికి ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. లోకాయుక్తకు న్యాయమూర్తిగా సేవలందించిన సమయంలోనే ప్రజల వాస్తవ సమస్యలను అర్థం చేసుకునేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. సమాజంలో శ్రీమంతులైతే చాలు.. కారాగారానికి వెళ్లి వచ్చినా సలాం కొడతారని వ్యాఖ్యానించారు. నేటి సమాజంలో నిజాయతీ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలలో కేసుల విచారణ సుదీర్ఘ కాలం కొనసాగడం సరికాదన్నారు. మనిషి సరళ జీవితాన్ని గడపడమే అన్ని సమస్యలకూ పరిష్కారమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని