logo

జన జాగృతికి సృజన వేదిక

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ సంస్థల నేతృత్వంలో వినూత్నంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 26 Jan 2023 03:11 IST

జాగృతి వాహనం వద్ద ఓటరు గుర్తింపు కార్డులు ప్రదర్శిస్తున్న యువకులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ సంస్థల నేతృత్వంలో వినూత్నంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక వాహనాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. టౌన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ యువతకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన వేళ.. వారి ప్రదర్శన వినూత్నంగా సాగింది. నిపుణులు, ప్రముఖ చిత్రకారులు టౌన్‌హాల్‌ సమీపంలో ఓటరు జాగృతి చిత్రాలను తీర్చిదిద్దారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేందుకు, ఆధార్‌తో గుర్తింపు కార్డును అనుసంధానం చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని