logo

బోనులో పడిన చిరుత

టి.నరసీపుర తాలూకా హొరళహళ్లిలో జయంత్‌ (11) ఏళ్ల బాలుడిని కడతేర్చిన చిరుత ఎట్టకేలకు బుధవారం రాత్రి బోనులో పడింది.

Published : 27 Jan 2023 03:08 IST

మైసూరు, న్యూస్‌టుడే : టి.నరసీపుర తాలూకా హొరళహళ్లిలో జయంత్‌ (11) ఏళ్ల బాలుడిని కడతేర్చిన చిరుత ఎట్టకేలకు బుధవారం రాత్రి బోనులో పడింది. గ్రామ శివార్లలో ఉంచిన ఒక బోనులో పడిన చిరుతను చంపేయాలని గ్రామస్థులు నినదించారు. అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వారికి హామీ ఇచ్చి.. అక్కడి నుంచి అటవీ విభాగానికి చిరుతను తరలించారు. అధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని మైసూరు వ్యవహారాల బాధ్యుడు ఎస్‌టీ సోమశేఖర్‌ తెలిపారు. చిరుత నుంచి సేకరించిన నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపిస్తామని ఆయన చెప్పారు. మైసూరులోని ప్రాణి పునర్వసతి కేంద్రం లేదా బన్నేరుఘట్ట అటవీ విభాగంలో ఈ చిరుతను ఉంచే విషయాన్నీ పరిశీలిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని