logo

అపూర్వ సూర్య దర్శనం!

కంటికి ఎటువంటి రక్షణ అద్దాలు ధరించకుండా, 42 నిమిషాలు సూర్యుడిని చూసి మైసూరుకు చెందిన బదరి నారాయణ కొత్త రికార్డును సృష్టించారు.

Updated : 27 Jan 2023 12:30 IST

సూర్యడిని వీక్షిస్తున్న బదరీ నారాయణ

మైసూరు, న్యూస్‌టుడే : కంటికి ఎటువంటి రక్షణ అద్దాలు ధరించకుండా, 42 నిమిషాలు సూర్యుడిని చూసి మైసూరుకు చెందిన బదరి నారాయణ కొత్త రికార్డును సృష్టించారు. ఈ రికార్డును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు నిర్వాహకులు చేరవేశారు. వారి నుంచి దస్త్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ వివరాల్లోకి తొంగిచూస్తే.. మైసూరు కోట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రాణాయామం చేస్తూ సూర్యుడిని చూస్తూ బదరీనారాయణ అందరినీ ఆశ్చర్యపరిచారు. చలువ అద్దాలు, ప్రత్యేక రక్షణ లేకుండా మండే సూర్యుడిని చూస్తే.. చూపు దెబ్బతింటుందనే విషయం నాకు తెలుసని ఆయన వివరించారు. చాన్నాళ్లుగా ప్రాణాయామం చేస్తూ, దృష్టి మొత్తాన్ని శ్వాసపై కేంద్రీకరించి, ఈ సాహసాన్ని బుధవారం మధ్యాహ్నం చేశారు. ‘మా తల్లి రథసప్తమి రోజు జన్మించారు. ఆమెకే ఈ రికార్డును అంకితం చేస్తున్నా’నని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు