logo

సాంస్కృతిక సౌరభం..వసంత వైభవం

హంపీ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం హొసపేటె పట్టణ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం జానపద కళా ప్రపంచాన్ని ఆవిష్కరించింది.

Published : 27 Jan 2023 03:08 IST

ఆకట్టుకున్న కళాబృందాల ఊరేగింపు

ఉగ్రనరసింహుడి వేషధారణలో కళాకారుడి బీభత్సం

హొసపేటె, న్యూస్‌టుడే: హంపీ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం హొసపేటె పట్టణ ప్రధాన వీధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాబృందాల వసంత వైభవ కార్యక్రమం జానపద కళా ప్రపంచాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలోని నలు మూలల నుంచి సుమారు 40 కళాబృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మరగాళ్ల కళాకారులు, నందికోలు, కోలాట, డోలు, కంసాళె, లంబాడీల గిరిజన నృత్యం, రామాయణ దృశ్యాభియనం కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సారి ఊరేగింపులో ఆశా కార్యకర్తలు కూడా పాల్గొనడం ప్రత్యేకం. మంత్రులు శశికళా జొల్లె, ఆనంద్‌సింగ్‌, ఎంపీ దేవేంద్రప్పలు పచ్చజెండా ఊపి ఊరేగింపును ప్రారంభించారు. జానపదం మన పథం కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. హంపీలోని కన్నడ మాతా భువనేశ్వరి ఉత్సవమూర్తిని వాహనంలో ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అలంకరించారు. హంపీ ఆలయం ఏనుగు లక్ష్మీకూడా ఊరేగింపులో పాల్గొంది. భువనేశ్వరి మాతా ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించిన వాహనాన్ని స్వయాన మంత్రి ఆనంద్‌సింగ్‌ నడిపారు. పాదగట్టె ఆంజనేయ ఆలయం, మూడంగళ్ల కూడలి, ప్రయాణ ప్రాంగణం, పునీత్‌, అంబేడ్కర్‌ కూడళ్ల గుండా సాగిన ఊరేగేంపు జిల్లా క్రీడామైదానంలో సమాప్తమైంది. జిల్లా పాలనాధికారి టి.వెంకటేశ్‌, జడ్పీ సీఈవో హర్షల్‌ బోయర్‌, ఎస్పీ శ్రీహరిబాబు ఊరేగింపులో పాల్గొన్నారు.

వసంతవైభవంలో కళాబృందాల ఊరేగింపు


మహిళ జానపద నృత్యం, లంబాడీ మహిళల గిరిజన నృత్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని