logo

‘ముఖ్యమంత్రిపై మాట్లాడే నైతికత మీకెక్కడిది?’

ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు.

Published : 27 Jan 2023 03:08 IST

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవో, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు. అవినీతిలో కాంగ్రెస్‌ పెద్ద రాయబారి. కాంగ్రెస్‌ నేతల డీఎన్‌ఏలో కూడా అవినీతి తెలుస్తోందని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి.శ్రీరాములు విమర్శించారు. విమ్స్‌ వైద్య కళాశాల క్రీడామైదానంలో 74వ గణతంత్ర దినోత్సవంలో త్రివర్ణ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు నోరు విప్పితే అవినీతి మాటలు తప్పా...మరి ఏమి రావడం లేదన్నారు. తమ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడే నైతికత కాంగ్రెస్‌ నేతలకు లేదన్నారు. సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌ దోస్తిల రంగు త్వరలో వెల్లడికానుందన్నారు. ఓటమి భయంతో సిద్ధరామయ్య కోలారు వీడే ఆలోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు అంత సులభం కాదన్నారు. ఏడాది ముందు బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు తీయించినట్లు తెలిపారు. రాబోయే విధానసభ ఎన్నికల్లో బళ్లారి జిల్లా నుంచే పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. బళ్లారి గ్రామీణ, లేకుంటే సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. డీసీ పవన్‌కుమార్‌ మాలపాటి, జడ్పీ సీఈవో జి.లింగమూర్తి, ఎస్పీ రంజిత్‌కుమార్‌ బండారు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు